ఆత్మస్థైర్యం దెబ్బతీసే వారిని వదలం : బండి సంజయ్

0
6

భగీరథ కేసుపై స్పందించిన కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar, “నా కొడుకు అయినా చట్టం ముందు సమానమే” అన్నారు. తన కుమారుడు తప్పు చేస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు. ప్రజా జీవితంలో బిజీగా ఉండటంతో కుటుంబానికి సమయం ఇవ్వలేకపోయానని, అదే తన తప్పని పేర్కొన్నారు.

తన కుమారుడు తప్పు చేయలేదని చెబుతున్నప్పటికీ చట్టాన్ని, కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తామని తెలిపారు. కుటుంబంపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేసిన వారిని వదిలేది లేదన్నారు.