హైదరాబాద్‌లోని Singareni Collieries Workers Union (AITUC) నాయకులతో సింగరేణి డైరెక్టర్ (పర్సనల్) Gautham Potru సమావేశమై కార్మికుల సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మెడికల్ బోర్డు ఏర్పాటు, పెండింగ్ డిపెండెంట్ ఉద్యోగాలు, వైద్య బిల్లుల పరిష్కారం, ట్రాన్స్‌ఫర్లు, ప్రమోషన్లు, అండర్‌గ్రౌండ్ అలవెన్స్ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. రిటైర్డ్ కార్మికులకు బకాయి బోనస్, PLR చెల్లిస్తామని తెలిపారు.
గోల్డెన్ హ్యాండ్‌షేక్ లేదా VRS అమలు చేయబోమని స్పష్టం చేశారు. సమావేశంలో వాసిరెడ్డి సీతారామయ్య, కొరీమి రాజ్‌కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.










