మంచిర్యాలలో ఘనంగా ఇంటర్నేషనల్ నర్స్ డే వేడుకలు

0
9

మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ నర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా డాక్టర్ సెల్ చైర్మన్ చందన ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు Pinninti Raghunath Reddy ముఖ్య అతిథిగా హాజరై నర్సింగ్ సిబ్బందిని సన్మానించారు.

నర్సులు ప్రజల ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని, కరోనా సమయంలో వారి సేవలు మరువలేనివని ఆయన అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పెంట రజితతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.