ప్రధాని పక్కన తండ్రి.. పోలీస్ రికార్డుల్లో పరారీలో కొడుకు! ఇది న్యాయమా?
మే 10న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ సాక్షిగా ఒక వింత జరిగింది. పోలీస్ రికార్డుల ప్రకారం ఒక కేంద్ర మంత్రి కొడుకు మైనర్ బాలికపై అఘాయిత్యం చేసి ‘అజ్ఞాతం’ (Absconding) లో ఉన్నాడు.
కానీ చిత్రమేంటంటే, అదే సమయంలో ఆ నిందితుడి తండ్రి మాత్రం ప్రధాని మోదీ పక్కన కూర్చుని చిరునవ్వులు చిందిస్తున్నారు.
బెంగాల్‌లో ఆడబిడ్డల కోసం గర్జించే నాయకులు, ఇక్కడ మంత్రి కొడుకుపై కేసు ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? సామాన్యుడికి ఒక చట్టం, అధికారం ఉన్నవాడికి మరో చట్టమా? పోక్సో (POCSO) కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఆ వేదిక ఒక ‘సేఫ్ జోన్’లా ఎలా మారింది?
‘బేటీ బచావో’ అంటే కేవలం గోడల మీద రాతలేనా? అధికార పీఠాల మీద ఉన్నవారి మౌనం బాధితురాలికి చేసే ద్రోహం. చట్టం తన పని తాను చేయకపోతే, సామాన్యుడికి న్యాయం మీద నమ్మకం పోతుంది!










