Beerla Ilaiah ఎన్డీడీబీతో మదర్ డైరీ ఒప్పందం కుదిర్చడంలో కీలక పాత్ర పోషించి, రైతులకు రూ.10 కోట్ల సహాయం అందించడంలో సహకరించినందుకు రాజాపేట పాడి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. A. Revanth Reddy పూర్తి సహకారంతో ఈ నిధులు అందాయని పేర్కొంటూ రాజాపేట బాల సొసైటీ కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండలంలోని బూరుగుపల్లి, సోమవారం తదితర గ్రామాల్లో కూడా పాడి రైతులు పాలాభిషేక కార్యక్రమాలు నిర్వహించి ఆనందం వ్యక్తం చేశారు.










