ఉబర్ CEO Dara Khosrowshahi నేతృత్వంలోని ప్రతినిధి బృందం A. Revanth Reddyతో జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయింది. హైదరాబాద్‌లోని ఉబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ, భారత్ ఫ్యూచర్ సిటీలో కార్పొరేట్ కార్యాలయ నిర్మాణంపై చర్చించారు.
ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి సారించాలని సీఎం సూచించారు. మల్టీలెవల్ పార్కింగ్, EV ఛార్జింగ్ సెంటర్ల ఏర్పాటుపై ముందుకు రావాలని కోరారు. 30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీకి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలను ఆహ్వానిస్తున్నామని సీఎం తెలిపారు. ఉబర్ ప్రతినిధులు ప్రభుత్వ సహకారం కోరుతూ భవిష్యత్తులో మరింత విస్తరణ చేపడతామని వెల్లడించారు.










