“ఆల్వాల్ పోలీసుల దర్యాప్తుకు న్యాయస్థానం మద్దతు”
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ పోలీస్ స్టేషన్లో 2020లో నమోదైన భార్యపై హత్యాయత్నం, వేధింపులు, వరకట్న వేధింపుల కేసులో నిందితుడికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.
ఆల్వాల్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం. 227/2020లో భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 307, 498-ఎతో పాటు వరకట్న నిషేధ చట్టం సెక్షన్లు 3, 4 కింద నమోదు చేసిన కేసు, అనంతరం ఎస్.సి. నెం. 462/2021గా విచారణకు వెళ్లింది.
ఈ కేసులో నిందితుడు చెరుకు రోహిత్ కుమార్ (39), ప్రైవేట్ ఉద్యోగి, ఓల్డ్ ఆల్వాల్లోని రిట్రీట్ కాలనీ, సాయి శ్రీనివాస్ అపార్ట్మెంట్ నివాసి అని పోలీసులు తెలిపారు.
ఈ కేసును విచారించిన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మేడ్చల్లోని ప్రధాన సెషన్స్ న్యాయమూర్తి నిందితుడిని దోషిగా తేల్చి ఒక సంవత్సరం ఆరు నెలల సాధారణ జైలు శిక్ష (Simple Imprisonment) తో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించారు.
#Sidhumaroju
Alwal










