ఆర్టీసీ బస్టాండ్‌లో ఘోర ప్రమాదం.. 14 నెలల చిన్నారి మృతి

0
5

కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 14 నెలల చిన్నారి తరుణ్ ప్రాణాలు కోల్పోయాడు. బస్సు ఎక్కుతున్న సమయంలో మరో ఆర్టీసీ బస్సు రివర్స్ తీస్తుండగా చిన్నారిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన తరుణ్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

ఘటనకు నిరసనగా కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాలు డిపో ఎదుట రాస్తారోకో నిర్వహించి డ్రైవర్‌పై కఠిన చర్యలు, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన ఆర్టీసీ అధికారులు రూ.25 వేల అత్యవసర సాయం అందించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.