నందిగామ రామన్నపేట రోడ్డు బైపాస్‌లో ఏర్పాటు చేసిన అశోక్ అగ్రికల్చర్ వర్క్ షాప్‌ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఘనంగా ప్రారంభించారు. రైతులకు అవసరమైన వ్యవసాయ యంత్రాలు, మరమ్మత్తు సేవలు స్థానికంగానే అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి ఈ వర్క్ షాప్ ఉపయోగపడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కూటమి నేతలు, రైతులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










