పాఠశాలల్లో యోగా బోధనకు అర్హులైన గురువులను నియమించాలి

0
0

🟢ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు వినతిపత్రం

▶️నందిగామ సెప్టెంబర్ 28bharat aawaz : ప్రభుత్వ పాఠశాలల్లో యోగా బోధనకు అర్హత, అనుభవం కలిగిన యోగా గురువులను నియమించాలని కోరుతూ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు యోగా గురువులు వినతిపత్రం అందజేశారు.

ప్రస్తుతం పాఠశాలల్లో యోగా తరగతుల బాధ్యతలను వ్యాయామ ఉపాధ్యాయులకు (PET) అప్పగించడం అభ్యంతరకరమని పేర్కొన్నారు. గతంలో పీఎం శ్రీ పాఠశాలల్లో అర్హత కలిగిన యోగా గురువులను నెలకు రూ.12,500 వేతనంతో నియమించి విద్యార్థులకు యోగా బోధించారని తెలిపారు.

తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ పీఎం శ్రీ పాఠశాలల్లో అర్హత కలిగిన యోగా గురువులను నియమించి విద్యార్థులకు యోగా విద్య అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.