పెన్షన్ ఆశతో.. ఖాతా క్లోజ్‌తో.|

0
6

● సీనియర్ సిటిజన్ పెన్షనర్ ఐడీ ఇప్పిస్తానని నమ్మబలికిన సైబర్ మోసగాడు

● వాట్సాప్‌లో ప్రొఫార్మా పంపి వివరాలు తీసుకున్న నిందితుడు

అల్వాల్, సెప్టెంబర్ 28: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని నేరేడ్‌మెట్‌కు చెందిన వ్యక్తిని నకిలీ బ్యాంకు ప్రతినిధి పేరుతో సంప్రదించిన సైబర్ మోసగాడు రూ.3.36 లక్షలు కాజేశాడు. 

సీనియర్ సిటిజన్ పెన్షనర్ ఐడెంటిటీ కార్డు ఇప్పిస్తానంటూ బాధితుడికి వాట్సాప్‌లో బ్యాంకు ప్రొఫార్మా పంపించాడు.

బ్యాంకు ప్రతినిధి నిజమేనని నమ్మిన బాధితుడు నిందితుడు సూచించిన విధంగా ప్రొఫార్మాను పూర్తి చేసి పంపించాడు.

ఆయనకు తెలియకుండానే బ్యాంకు ఖాతా నుంచి రూ.3.36 లక్షలు వెళ్లిపోయాయి .

మోసం జరిగినట్లు గుర్తించిన బాధితుడు మల్కాజిగిరి పోలీసులను ఆశ్రయించాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు ఉపయోగించిన మొబైల్ నంబర్, వాట్సాప్ సంభాషణలు, పంపిన ప్రొఫార్మాతో పాటు నగదు బదిలీ వివరాలను పరిశీలిస్తున్నారు. డబ్బు ఏ ఖాతాకు మళ్లించారనే అంశంపైనా దర్యాప్తు కొనసాగుతోంది.

#Sidhumaroju

Alwal