అన్నమయ్య జిల్లా: బయో చెక్ కిట్లు ప్రారంభం.

0
3

అన్నమయ్య జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు పోలీసు శాఖ కీలక చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ చొరవతో 700 ‘బయో-చెక్ రాపిడ్ డ్రగ్ టెస్ట్ కిట్లు’ పోలీసులకు అందజేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్ మదనపల్లె పోలీస్ కార్యాలయంలో ఈ కిట్లను పంపిణీ చేశారు. యూరిన్ పరీక్ష ద్వారా 2-5 నిమిషాల్లోనే గంజాయి వినియోగాన్ని గుర్తించవచ్చని, కార్డన్ అండ్ సెర్చ్, ఈగల్ సెల్ తనిఖీల్లో వీటిని వినియోగించనున్నట్లు తెలిపారు