ప్రభుత్వ బడుల్లోనే ఉన్నత విద్య….

0
2

ప్రభుత్వ బడుల్లోనే ఉన్నత విద్య….

భారత్ అవాజ్ న్యూస్ 15 మే రోజున దుగ్గొండి మండలం» వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదలి…  మల్లంపల్లిలో ఘనంగా బడిబాట…. ర్యాలీ, ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న కలెక్టర్ సత్య శారద… జిల్లా టాపర్ కావ్యశ్రీకి కలెక్టర్ సన్మానం….

దుగ్గొండి  ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన ఉన్నత విద్య అందుతుందని…

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. దుగ్గొండి మండలం మల్లంపల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా హాజరై బడిబాట ర్యాలీ, ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. తల్లిదండ్రులను కలిసి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని తెలిపారు. విద్యార్థులకు సమతుల పౌష్టికాహారం, మౌలిక వసతులు, అర్హత కలిగిన ఉపాధ్యాయులతో ఉత్తమ బోధన అందుతోందని, ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. మల్లంపల్లి జెడ్పీహెచ్ఎస్లో చదివిన కావ్యశ్రీ ఎస్సెస్సీ పరీక్షల్లో 566 మార్కులు సాధించి మండల స్థాయిలో ప్రథమ, జెడ్పీ పాఠశాలల విభాగంలో జిల్లా స్థాయిలో మొదటి స్థానం సాధించడం అభినందనీయమన్నారు. ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ఈకార్యక్రమంలో పలువురు తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాఠశాలల అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు….

జిల్లా టాపర్ జనగాం కావ్యశ్రీ ఘన సన్మానం…

ఇటీవల పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల జిల్లా టాపర్గా నిలిచిన మల్లంపల్లి హైస్కూల్ విద్యార్థిని జనగాం కావ్యశ్రీని కలెక్టర్ ఘనంగా సన్మానించారు. పట్టుదలతో ఉన్నత శిఖరాలు అధిగమించాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి, డీఈఓ రంగయ్య నాయుడు, తహసీల్దార్ సమ్మక్క ఎంపీడీవో లెక్కల అరుంధతి, సీఎంఓ డాక్టర్ కే.శ్రీనివాస్, ఎంఈఓ వెంకటేశ్వర్లు, జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు అజ్మీర భార్గవి, స్థానిక మల్లంపల్లి సర్పంచ్ బూర రాధిక హేమచంద్ గౌడ్ సంబంధిత అధికారులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము….