పుంగనూరు మండలం నేతిగుట్లపల్లె పంచాయతీ దిగువకొండమీదపల్లెకు చెందిన మాధురి (27) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం పుట్టినిల్లు పెద్దపంజాణి మండలం ముత్తుకూరు నుంచి తన భర్త, ఇద్దరు కుమార్తెలతో కలిసి ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. మార్గమధ్యంలో తన ఏడాది పాపకు బైక్ దిగి పాలు ఇస్తుండగా వీరిపైకి కారు దూసుకొచ్చింది. మాధురి, భర్త మురళి, కుమార్తె యశస్విని (1) గాయపడ్డారు. పుంగనూరులో ప్రథమ చికిత్స అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మాధురి ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు# కొత్తూరు మురళి.










