సామాన్యుడి కొడుకు పేరు FIR లో వస్తే “నేరస్థుడు” అని ముద్ర వేస్తారు. అధికారంలో ఉన్న వారి కొడుకు పేరు వస్తే “రాజకీయ కుట్ర” అంటారు. పేదవాడి ఇంట్లో జరిగితే 24 గంటల్లో అరెస్ట్ చేస్తారు..
పదవిలో ఉన్న వారి ఇంట్లో జరిగితే ముందు మీడియాను మేనేజ్ చేస్తారు, తర్వాత చట్టాన్ని మెలిపెడతారు. చట్టం పుస్తకాల్లో అందరికీ సమానమే. కానీ అమలులో మాత్రం పదవి, డబ్బు, పవర్ చూసి నడుస్తోంది అనే అనుమానం ప్రజల్లో పెరుగుతోంది. బాధితురాలు ఎవరి కూతురైనా సరే… నిందితుడు ఎవరి కొడుకైనా సరే, న్యాయం మాత్రం ఒకటే కావాలి.
గ్యార మల్లేష్ ,బహుజన్ సమాజ్ పార్టీ. రంగారెడ్డి జిల్లా కార్యదర్శి










