సింగరేణిలో “రివ్యూ మీటింగ్‌లు” పేరుతో కాలక్షేపం జరుగుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు కార్మికుల్లో తీవ్రంగా వినిపిస్తోంది,సమస్యల పరిష్కారం కోసం నిర్వహించాల్సిన సమావేశాలు కేవలం ఫోటోలు, ప్రకటనలు, హామీలకే పరిమితమవుతున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మీటింగ్ తర్వాత “సానుకూల చర్చ జరిగింది”, “త్వరలో పరిష్కారం” అనే మాటలు వినిపిస్తున్నా, నేలమీద మార్పు మాత్రం కనిపించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి,పెండింగ్ డిమాండ్లు,ఉద్యోగ భద్రత,ఖాళీల భర్తీ,కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు,ఇవన్నీ సంవత్సరాలుగా పెండింగ్‌లోనే ఉండగా, యాజమాన్యం మరియు కొన్ని యూనియన్ నాయకులు మాత్రం రివ్యూ మీటింగ్‌ల పేరుతో కాలాన్ని నెట్టేస్తున్నారనే అభిప్రాయం బలపడుతోంది,సింగరేణి కార్మికుల కష్టం మీద నడిచే సంస్థ.
కాబట్టి సమావేశాలు కేవలం ప్రదర్శనగా కాకుండా, సమస్యల పరిష్కారానికి మార్గదర్శకంగా మారాలని కార్మికులు కోరుతున్నారు.“మీటింగ్‌లు కాదు… ఫలితాలు కావాలి” అనే నినాదం ఇప్పుడు సింగరేణి ప్రాంతాల్లో గట్టిగా వినిపిస్తోంది.










