గొర్రెను కాపాడబోయి మృత్యువు బడిలోకి….!

0
1

బావిలో పడి బాలుడు మృతి.. రంగాపురంలో ఘటన….

భారత్ అవాజ్ న్యూస్: 15 మే నేడు సాయంత్రం

ఖానాపురం మండలంలో గొర్రె పిల్లని కాపాడబోయి ఓ బాలుడు ప్రాణాలు…కోల్పోయిన ఘటన మండలంలోని రంగాపురం గ్రామంలో జరిగింది. పులిగిల్ల మల్లేష్ – మానస కొడుకు పులిగిల్ల రాఘవ (11) 5 వ తరగతి పూర్తి చేశాడు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇంట్లో గొర్రె పిల్లలను మేపడా నికి పొలాల వైపు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఓ గొర్రె పిల్ల మేత మేస్తూ బావి దగ్గరకు వెళ్లింది. గొర్రె పిల్ల బావిలో పడుతుందని బాలుడు గమనించి కాపాడబోయి బావిలో పడ్డాడు. గమనించిన స్థానికులు బావిలో వెతకగా బాలుడు ఆచూకీ చిక్కలేదు. సాయంత్రం 4 గంటల వరకు బావిలో వెతికి నీటిని తోడగా మృతదేహం లభ్యమైంది. ముక్కుపచ్చలారని బాలుడు మృతి రంగాపురం గ్రామంలో విషాదాన్ని నింపింది. బాలుడి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.