ఆసిఫాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చదివి ఉద్యోగలు సాధించిన విజేతలకు ఘన సన్మానం

0
2

భరత్ ఆవాజ్ ప్రతినిధి చునర్కర్  జగదీష్ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: కేద్ర గ్రంధాలయంలో చదివి. వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన జిల్లా అభ్యర్థులను. సత్కరించెందుకు ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటైంది. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక-విద్య వారోత్సవాల’లో భాగంగా ఈ రోజు శుక్రవారం 15/05/2026 ఉదయం 10-30 గంటలకు జిల్లా గ్రంధాలయ ప్రాంగణంలో ఈ ఘన వేడుక జరగనుంది.

గ్రంధాలయంలోని పుస్తకాలను,వసతులను సద్వినియోగం చేసుకొని పట్టుదలతో శ్రమించి ప్రభుత్వ ఉద్యోగలు సాధించిన స్థానిక యువతను ఈ సందర్బంగా ప్రత్యేకంగా గౌరవించనున్నారు ఈ కార్యక్రమనికి జిల్లా పాలనా అధికారి.జిల్లా పోలీస్. అధికారరులు. జిల్లా గ్రంధాలయ చైర్మన్.జిల్లా విద్య అధికారి. జిల్లా పంచాయతీ అధికారులు.మరియు మున్సిపల్ కమిషనర్. గారు గౌరవ అతితులుగా హాజరు కనున్నారు అలాగే మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు సర్పంచులు ఉపసర్పంచులు ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు,మరియు సిబ్బంది పాల్గొని విజేతలను ప్రోత్సహించునున్నారు.

కార్యక్రమ ముఖ్య విశేషాలు:
1.పుస్తక ప్రదర్శన:విజ్ఞానబండగరాల వీక్షణ మరియు ప్రత్తేక పుస్తక ప్రదర్శన
2.స్ఫూర్తి ప్రసంగాలు:ఉద్యోగ విజేతలు తాము గ్రంధాలయంలో చదివి ఎలా విజయం సాధించారనే అనుభవలను తోటి అభ్యర్థులతో పంచుకోవడం.
3.ఘన సన్మానం:కడ్తపడి విజయం సాధించిన జిల్లాకు మంచిపేరు తెచ్చిన అభ్యర్థులకు అధికారులు ప్రత్యేక గౌరవ సత్కారాలు అందజేస్తారు.

కావున జిల్లాలోని పోటీపరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు, నిరుద్యోగ యువతి యువకులు మరియు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆసిఫాబాద్ జిల్లా గ్రంధాలయ ఆఫీకారులు కోరారు.