“కుళాయిలు ఉన్నాయి… నీళ్లు ఎక్కడ?”

0
3

ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్య ఇంకా వేలాది గ్రామీణ కుటుంబాలను ఇబ్బంది పెడుతోంది. కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా… భూగర్భ జలాల కొరత, ఎండిపోతున్న బోర్లు, ఫ్లోరైడ్ సమస్యలు, సరైన నిర్వహణ లేకపోవడం వంటి కారణాలతో అనేక ప్రాంతాల్లో నీటి కష్టాలు కొనసాగుతున్నాయి.

వేసవి వస్తే ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితి ఇంకా కనిపిస్తోంది. నిపుణులు మాత్రం కేవలం పైపులు వేయడం సరిపోదని… వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల సంరక్షణ, నీటి నిర్వహణ బలోపేతం కావాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.