గిరిజనేతరులు ఆప్షన్ ఫారంలో త్వరగా ఇవ్వాలి!

0
3

పోలవరం ప్రాజెక్టు గిరిజనేతర నిర్వాసితుల పునరావాస ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. పునరావాసం కోసం నిర్దేశించిన ఆప్షన్ ఫారమ్‌లను వెంటనే సమర్పించాలని చింతూరు ఐటీడీఏ పీఓ (Project Officer) శుభాంనోక్వల్ సూచించారు. గురువారం తన కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన ఈ ప్రకటన చేశారు. నిర్ణీత గడువు దాటిన తర్వాత సమర్పించే ఏ ఆప్షన్ ఫారమ్‌లను పరిగణనలోకి తీసుకోబోమని పీఓ స్పష్టం చేశారు. ప్రాజెక్టు కారణంగా ఇళ్లు కోల్పోతున్న గిరిజనేతర కుటుంబాలకు త్వరగా న్యాయం జరిగేలా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఆప్షన్ ఫారమ్‌ల ఆధారంగానే నిర్వాసితులకు అవసరమైన ప్లాట్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. ప్రతి నిర్వాసిత కుటుంబం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, తమ ఆప్షన్లను వెంటనే నమోదు చేసుకోవాలి. జాప్యం జరిగితే పునరావాస ప్రక్రియలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

 

# Yadagiri