చిత్తూరు: పాలిటెక్నిక్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానం: కలెక్టర్

0
4

ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పుంగనూరు సమీపంలోని అగ్నిగొండిపల్లి గ్రామంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు.

ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు రెండు సంవత్సరాల వ్యవధి గల వ్యవసాయ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9381359956, 9010402068 నంబర్లను సంప్రదించవచ్చు# కొత్తూరు మురళి.