కరీంనగర్ పట్టణం ముకురాంపురం ఆరెల్లి మల్లేష్ అనే వ్యక్తి తన తండ్రి ఆరెల్లి నరసయ్య గొడ్డలితో నరికి కిరాతనంగా హత్య చేశారని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్థలానికి చేరుకుని మృహదేహాన్ని పరిశీలించారు.
కేసు నమోదు చేసి పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.










