ఆసిఫాబాద్‌: టిఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ

0
2

తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రయాణికులు, కూలీల దాహార్తిని తీర్చేందుకు ఆసిఫాబాద్, సిర్పూర్ ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, కోనేరు కోనప్పల ఆదేశాల మేరకు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ ఎండి హైమద్, మాజీ జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణ, కోవ సాయి, సింగల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు స్థానిక కౌన్సిలర్లు, సర్పంచ్ రవిందర్, టౌన్ ప్రెసిడెంట్ అహ్మద్ మరియు పార్టీ ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.