నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అధునాతన గుండె వైద్య సేవలను బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. తరచూ స్పృహ తప్పే సమస్యతో బాధపడుతున్న యాదయ్య అనే రోగికి వైద్య బృందం ఇక్కడ తొలి యాంజియోగ్రామ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించింది.
ఆసుపత్రిలో కార్డియాలజిస్టుల కొరత, క్యాథ్ ల్యాబ్ సమస్యలను ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి ముగ్గురు కార్డియాలజిస్టులను డిప్యూటేషన్‌పై నియమించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఈ సేవలు అందుబాటులోకి రావడం సామాన్య ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని IIHFW గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ డా. కవిత రెడ్డి పేర్కొన్నారు.










