మదనపల్లిలో సుమారు 200 మంది రౌడీషీటర్లకు జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు డీఎస్పీ పావని ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. పాత నేరాలకు స్వస్తి చెప్పి బాధ్యతాయుతంగా జీవించాలని.
లేదంటే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు నిఘా ఉంచుతారని తెలిపారు.










