మదనపల్లె మండలంలో ఆదివారం అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ ఢీకొని దంపతులతో పాటు వారి కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. అనపగుట్టకు చెందిన కుటుంబం ద్విచక్ర వాహనంపై వెళుతుండగా.
సీటీఎం రోడ్డు తట్టివారిపల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు గాయపడిన వారిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించగా, వైద్యుల చికిత్సతో ప్రాణాపాయం తప్పింది. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.









