గిరిజన ప్రాంత మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా సరికొత్త అడుగు పడింది. ‘అరణ్య శ్రీ’ కార్యక్రమం ద్వారా ద్వాక్రా మహిళలకు భారీ లబ్ధి చేకూరనుందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం చింతూరు మండలం గొందిగూడెంలో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అటవీ సంరక్షణతో పాటు స్థానిక మహిళలకు ఉపాధి కల్పించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రక్షిత అటవీ ప్రాంతాల్లో సహజసిద్ధంగా పెరిగిన వెదురును విక్రయించగా వచ్చే ఆదాయంలో.. సగం ఆదాయాన్ని (50% షేర్) నేరుగా మహిళలకే అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు.11 గిరిజన గ్రామాలకు చెందిన 119 డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా ఉన్న 1154 మంది మహిళలకు ఆదాయం లభిస్తుందని తెలిపారు.
# Yadagiri










