పుంగనూరు నియోజకవర్గ : తాళం వేసిన ఇంట్లో చోరీ

0
3

పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం 106 రామిరెడ్డిగారి పల్లెలో శనివారం తెల్లవారుజామున తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. శంకర్ రెడ్డి ఇంట్లోకి చొరబడిన దొంగలు నగదుతో పాటు 12 గ్రాముల

బంగారు చైనును అపహరించారు. బాధితుడు శంకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్ టీం వేలిముద్రలు సేకరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు# కొత్తూరు మురళి.