ఇంధన పొదుపు కార్యక్రమం చేపట్టిన మిల్క్ యూనియన్ చైర్మన్

0
4

ప్రధాని, ముఖ్యమంత్రి సూచనలతో కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు హనుమాన్ జంక్షన్ పరిసర గ్రామాల్లో పాడి రైతులతో కలిసి సైకిల్ యాత్ర నిర్వహించారు. “పాడి రైతు సంక్షేమం మన మతం” కార్యక్రమంలో భాగంగా వారానికి ఒకరోజు సైకిల్ లేదా ఇంధనేతర ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించి ఇంధనాన్ని పొదుపు చేయాలని, పర్యావరణాన్ని కాపాడాలని రైతులకు పిలుపునిచ్చారు.

అదేవిధంగా, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెచ్చిన విద్యా సంస్కరణల వల్ల గ్రామీణ విద్యార్థులు రాణిస్తున్నారని కొనియాడారు. పదవ తరగతిలో అత్యధిక ప్రతిభ కనబరిచిన పాడి రైతుల పిల్లలకు ఈ సందర్భంగా నగదు ప్రోత్సాహకాలు అందించి సత్కరించారు.