చీరాల మండలం రెవెన్యూ”*

0
2

 

గ్రామాలలో వారసత్వ భూములపై ఇల్లు నిర్మించుకోవడానికి బ్యాంకు రుణాల కోసం పేదలు ‘పొజిషన్ సర్టిఫికేట్’ ఆశిస్తున్నారు. సరైన పత్రాలున్నా లింక్ డాక్యుమెంట్లు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, గ్రామ రెవెన్యూ అధికారులు ఒక్కో సర్టిఫికేట్‌కు ₹30,000 డిమాండ్ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. రోజుకు ₹500 సంపాదించే పేదలు ఈ భారం భరించలేక లబోదిబోమంటున్నారు. పైగా ఈ అవినీతిపై ఉన్నతాధికారులకు తెలవకుండా తాసిల్దార్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారు. న్యాయపక్షపాతిగా పేరొందిన చీరాల తాసిల్దార్ స్పందించి, తప్పుడు అధికారులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.