సైకిల్ పై ప్రయాణించిన ఆలేరు ఎమ్మెల్యే

0
2

భారత్ ఆవాజ్ న్యూస్ ఆలేరు 18   ఉదయం 6 గంటల నుండి యాదగిరిగుట్ట నుండి ఆలేరు వరకు సైకిల్పై ప్రయాణించిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో పేద మరియు సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతుందని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు మోడీ ప్రభుత్వం సామాన్య ప్రజలు

మళ్ళీ సైకిళ్లపై ప్రయాణించ వలసిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు అనంతరం వంగపల్లి మీదుగా ప్రయాణిస్తూ అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వడ్ల కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు పారదర్శకంగా మరియు వేగవంతంగా జరిగేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని  సూచించారు రైతుల పండించిన ప్రతి గింజను సరైన ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కొనుగోలు కేంద్రాల్లో లారీలు తూకం అమాలీలు వంటి సౌకర్యాలు సమయానికి అందుబాటులో ఉండేలా అధికారులను ఆదేశించారు రైతులకు ఇబ్బందులు కలుగుతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు