బుల్లెట్ 350పై చంద్రబాబు సవారీ… ఫొటోలు ఇవిగో!.

0
4

 

తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో రూ. 2,500 కోట్ల పెట్టుబడితో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ మోటార్‌సైకిల్ తయారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. కంపెనీ సీఈఓ బి. గోవిందరాజన్ ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం బుల్లెట్ 350 బైక్ ఎక్కి ఫొటోలకు పోజులిచ్చారు.

ఈ ప్లాంట్ ద్వారా ఏటా 9 లక్షల బైక్‌ల తయారీతో పాటు, దాదాపు 15,000 మందికి ఉపాధి లభిస్తుందని సీఎం తెలిపారు. గ్రీన్ ఎనర్జీ, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ వాతావరణం ఈవీ ప్రయాణానికి దోహదపడుతుందన్న చంద్రబాబు.. ఈ ప్రాజెక్టును 24 నెలలకు బదులు 18 నెలల్లోనే పూర్తి చేయాలని కంపెనీకి సూచించారు.