పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు) ఆదేశాల మేరకు, పుంగనూరు పట్టణంలోని కట్టమీద రోడ్డు పక్కన తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకుంటున్న చిరువ్యాపారులకు రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ తాజ్, శామీర్ లాల్ మరియు సద్దాం హుస్సేన్ ల బృందం అండగా నిలిచింది. వాతావరణ మార్పుల వల్ల, ఎండ మరియు అకాల వర్షాల నుండి తమ వ్యాపారాలను, సరుకులను కాపాడుకోవడానికి ఇబ్బంది పడుతున్న పేద వ్యాపారుల కష్టాలను గుర్తించి, చల్లా బాబు గారి సూచనల ప్రకారం వారికి ఉచితంగా టార్పాల్ (టార్పాలిన్) పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నూరుల్లా, ముజాహిద్, మౌల, ఇర్ఫాన్ పాల్గొన్నారు. ఎండ వానల నుండి రక్షణే లక్ష్యంగా ఈ సహాయం అందించబడింది# కొత్తూరు మురళి.










