శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు తన మార్క్ పాలనను చాటుకున్నారు. ఈ నెల 16న జరిగిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో హనుమాన్‌నగర్‌కు చెందిన గొర్లె జ్యోతి, సింహాద్రి భాస్కరరావు దంపతులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నామని, వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం చేయాలని సీఎంను వేడుకున్నారు.
బాధితుల పరిస్థితికి చలించిన చంద్రబాబు తక్షణమే స్పందించారు. వినతి స్వీకరించిన 24 గంటల్లోనే సీఎం సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున మొత్తం రూ. 4 లక్షలు మంజూరు చేశారు. ఈ చెక్కులను నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి నిన్న బాధితులకు అందజేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ. 3 కోట్లు అందించామని ఎమ్మెల్యే తెలిపారు.










