ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మెగా డాటర్ కొణిదెల నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియో విడుదల చేశారు. పిఠాపురం నియోజకవర్గం ప్రజలను ఆయన తన సొంత కుటుంబంలా చూసుకుంటున్నారని ఆమె కొనియాడారు. ఇటీవల అక్కడ ఒక ఎలక్ట్రిషియన్ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మరణించగా, పవన్ కల్యాణ్ వెంటనే స్పందించారని తెలిపారు. నియోజకవర్గంలోని మిగిలిన ఎలక్ట్రిషియన్ల భద్రతను కాపాడాలనే ఉద్దేశంతో మొత్తం 325 మందికి సేఫ్టీ కిట్లను అందజేశారని వెల్లడించారు. ప్రజా సమస్యల పట్ల సకాలంలో స్పందించడంలో పవన్ కల్యాణ్‌కు ఎవరూ సాటిరారని, పిఠాపురం వెళ్తే తనకు సొంతూరుకు వెళ్లినట్లే ఉంటుందని నిహారిక పేర్కొన్నారు.










