కాలుష్య పరిశ్రమలపై పవన్ కళ్యాణ్ సీరియస్!

0
5

దేశ పురోగతికి పరిశ్రమలు ఎంత ముఖ్యమో, పర్యావరణం, ప్రజల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.

తనిఖీ కమిటీలలో బాధితులను భాగస్వామ్యం చేయాలని.. శబ్ద కాలుష్య నిబంధనలు ప్రార్థనా మందిరాలతో సహా అందరికీ వర్తిస్తాయని తేల్చిచెప్పారు. గోస్తనీ నది కాలుష్యంపై పర్యావరణ అత్యవసర పరిస్థితిగా గుర్తించి, వ్యర్థాలు వదిలే పరిశ్రమలను డ్రోన్ల ద్వారా పర్యవేక్షించాలన్నారు. నెల్లూరు జిల్లా ‘వైట్ కేటగిరి’ పరిశ్రమల కాలుష్యంపై విచారణకు ఆదేశిస్తూ, గాలి నాణ్యత మెరుగుదలకు రూ.400 కోట్లు సక్రమంగా వినియోగించాలని సూచించారు.