మంచిర్యాలలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

0
5

గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా మంచిర్యాల సీసీసీ నస్పూర్ పరిధిలో గురువారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ నార్కోటిక్ డాగ్ స్క్వాడ్, యాంటీ నార్కోటిక్స్ వింగ్ సమన్వయంతో ఎస్సై ప్రశాంత్ ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. సీసీసీ నస్పూర్ కార్నర్, ఆటో స్టాండ్, సమీప హోటళ్లు, పాన్ షాపులలో అనుమానాస్పద ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత వీటికి దూరంగా ఉండాలని పిలుపునిస్తూ, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు, అక్రమ రవాణా నియంత్రణకు అనుమానితుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని కోరారు.