మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : యాప్రాల్ చెరువు కట్ట వద్ద ఆల్వాల్ ఎక్సైజ్ పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో భారీగా గంజాయి పట్టుబడింది.
మల్కాజిగిరి జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి నవీన్ కుమార్ ఆదేశాలు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి పర్యవేక్షణలో ఆల్వాల్ ఎక్సైజ్ ఎస్హెచ్ఓ బృందం నిన్న సాయంత్రం ఈ ఆపరేషన్ నిర్వహించింది.
నమ్మదగిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు యాప్రాల్ చెరువు కట్ట వద్ద ఎన్.డి.పి.ఎస్ చట్టం కింద అక్రమంగా గంజాయి రవాణా, విక్రయాలు జరుపుతున్న ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ దాడుల్లో నిందితుల నుంచి 2.5 కేజీల ఎండు గంజాయితో పాటు ఐదు మొబైల్ ఫోన్లు, మూడు ఎలక్ట్రిక్ వాహనాలు, ప్యాషన్ ప్లస్ బైక్, టీవీఎస్ ఎన్‌టార్క్, రెండు హోండా యాక్టివా స్కూటర్లతో కలిపి మొత్తం ఏడు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో మొత్తం ఏడుగురిని నిందితులుగా గుర్తించగా, వారిలో బాలాజినగర్‌కు చెందిన భోనాకల్లూరి గణేష్, బల్లెపూళ్ల తరుణ్, కాప్రాకు చెందిన భిశ్వకర్మ విష్ణుకుమార్, వరంగల్ జిల్లా మేకలగట్టుకు చెందిన పుప్పాల చంద్రకాంత్, మెదక్ జిల్లా మొగదుంపల్లెకు చెందిన సత్యరాం అరవింద్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా కొత్తూరు విశాల్, ఆనంద్ అనే మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పట్టుబడిన ఐదుగురు నిందితులను ఎక్సైజ్ అధికారులు రిమాండ్‌కు తరలించారు.
ఈ విజయవంతమైన దాడుల్లో ఆల్వాల్ ఎక్సైజ్ సిఐ జి. చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్ ఎస్. కుమారస్వామి, సబ్ ఇన్స్పెక్టర్ సంధ్యారాణి మరియు సిబ్బంది కీలక పాత్ర పోషించారు.
#Sidhumaroju










