ఏపీ జనాభా పథకం: దూరదృష్టి నిర్ణయమా? రాజకీయ వ్యూహమా?

0
5

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా తగ్గుదల భవిష్యత్తులో సమస్యగా మారవచ్చని భావిస్తూ, మూడో బిడ్డకు ₹30,000, నాలుగో బిడ్డకు ₹40,000 ప్రోత్సాహకం ఇవ్వాలని ప్రతిపాదించింది.

ఈ నిర్ణయం రాష్ట్రంలో విస్తృత చర్చకు దారితీసింది. కొందరు నిపుణులు దీనిని భవిష్యత్ workforce ను పెంచే దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికగా చూస్తుండగా, మరికొందరు రాజకీయ వ్యూహంగా విమర్శిస్తున్నారు. పెరుగుతున్న జీవన వ్యయాలు, విద్యా ఖర్చులు, ఆలస్య వివాహాలు వంటి కారణాలతో జననాల రేటు తగ్గుతున్న నేపథ్యంలో, ఈ పథకం నిజంగా ప్రభావవంతమవుతుందా అనే ప్రశ్న ఇప్పుడు ప్రధాన చర్చాంశంగా మారింది.