ఆంధ్రప్రదేశ్‌లో ‘డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల’ పంపిణీని కూటమి ప్రభుత్వం నిలిపివేసిందంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఇది జగన్ రెడ్డి వంకర బుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు.
పశ్చిమాసియా యుద్ధం కారణంగానే కిట్ల సరఫరాలో నెలరోజులు ఆలస్యమవుతోందని, రద్దు కాలేదని ఆయన స్పష్టం చేశారు. పాఠశాలలు తెరిచేనాటికి పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ అందిస్తామని… యూనిఫాం, బూట్లు, బ్యాగ్‌ల సరఫరాకు కొంత సమయం పడుతుందని తెలిపారు. వైసీపీ సోషల్ మీడియా వేదికగా వందశాతం అవాస్తవాలను, తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేస్తోందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.









