మండిపోతున్న ఏపీ: 48.3 డిగ్రీలతో రికార్డు ఎండలు

0
2

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు తీవ్రరూపం దాల్చాయి. తూర్పుగోదావరి జిల్లా చిట్యాల, గోపాలపురంలో ఈ సీజన్‌లోనే అత్యధికంగా 48.3 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదైంది. పశ్చిమగోదావరి, పల్నాడు, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు దాటాయి.

రాబోయే మూడు రోజుల పాటు తీవ్ర వడగాల్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. సోమవారం 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మరోవైపు ద్రోణి ప్రభావంతో ప్రకాశం, కర్నూలు, అనంతపురం తదితర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచించారు.