నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మి కల్యాణ మండపంలో సర్వసభ్య సమావేశం, విద్యార్థుల ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ, విశిష్ట అతిథిగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ.. విద్యార్థులను ప్రోత్సహిస్తున్న జిల్లా అధ్యక్షులు పోల విఠల్ రావు గుప్తను అభినందించారు. విద్యను ఎవరూ దోచుకోలేరని, విద్యతోనే ఉన్నత స్థానాలకు చేరవచ్చని పేర్కొన్నారు. తన తాత, తండ్రుల జ్ఞాపకార్థం పాఠశాలలు నిర్మించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణతో పాటు పలువురు వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.









