గోదావరిలో నీరు లేదని సాకులు చెబుతూ, కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం సరికాదు. బ్యారేజీల భద్రత పేరుతో ప్రభుత్వం రెండున్నరేళ్లుగా కాలక్షేపం చేస్తోంది. సగం నీటి మట్టంతోనైనా ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోసి, ఉత్తర తెలంగాణ సాగునీటి అవసరాలు, హైదరాబాద్ తాగునీటి కష్టాలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 150 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులను ఖాళీగా ఉంచి, ప్రకృతిని సాకుగా చూపడం తగదు. ఇప్పటికైనా మేడిగడ్డ మరమ్మతులు పూర్తి చేసి, ప్రాజెక్టుల ద్వారా నీటిని విడుదల చేయాలి. లేనిపక్షంలో ప్రజలు ప్రభుత్వ వైఫల్యాన్ని క్షమించరు. బాధ్యతాయుతంగా వ్యవహరించి రైతాంగాన్ని, ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.









