మొలకలచెరువులోని KGN ఫంక్షన్ హాల్లో బుధవారం మహానాడు మొదటి రోజు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ రాష్ట్ర నాయకులు కట్టా దొరస్వామి నాయుడు మాట్లాడుతూ, “మహానాడు పార్టీకి మార్గదర్శక వేదిక. ప్రతి కార్యకర్త ఐక్యంగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలి” అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










