బుధవారం నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లి పంచాయతీలో జరుగుతున్న జలధార పనులను జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులు, సిబ్బందితో కలిసి పనుల పురోగతి, నాణ్యతను తనిఖీ చేసిన ఆయన, భూగర్భ జలాల సంరక్షణకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. అనంతరం నిమ్మనపల్లిలోని బహుదా డ్యాంను సందర్శించి, నీటి నిల్వ సామర్థ్యం, కాలువల పరిస్థితిని సమీక్షించి, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని జలవనరుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.










