గోవధ కలకలం.. నిందితులను పట్టుకున్న పోలీసులు

0
7

మదనపల్లె పట్టణంలోని శాస్త్రి వీధిలో శుక్రవారం ఇళ్ల మధ్య గోవధకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు వెంటనే బీజేపీ, వీహెచ్‌పీ, జనసేన నాయకులకు సమాచారం అందించారు.
వారు వన్-టౌన్ పోలీసులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు గోవధకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకోగా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు.