డిజిటల్ అరెస్టులని ఫోన్ చేసేవాళ్లు అరెస్టవ్వాలి: సీఎం చంద్రబాబు.

0
6

డిజిటల్ అరెస్ట్ కేటుగాళ్లకు చెక్: ఏపీ సైబర్ గార్డ్ ఏర్పాటు

డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను భయపెట్టే మోసగాళ్లను కఠినంగా శిక్షించాలని సీఎం చంద్రబాబు పోలీసు శాఖను ఆదేశించారు. సైబర్ నేరాల కట్టడిపై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, బాధితుల నుండి ఫిర్యాదు అందిన వెంటనే ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేయాలన్నారు. నేరాల నియంత్రణకు 6 స్తంభాల వ్యూహంతో ‘ఏపీ సైబర్ గార్డ్’ వ్యవస్థను తీసుకువస్తున్నట్లు డీజీపీ తెలిపారు. మంగళగిరిలో అత్యాధునిక సైబర్ వార్ రూం 30 రోజుల్లో అందుబాటులోకి రానుంది.

మరో సమీక్షలో, మూలపేట, మచిలీపట్నం పోర్టులు, దగదర్తి, కుప్పం ఎయిర్‌పోర్టుల వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కచ్చితమైన కాలపరిమితిలో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. జాప్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.