సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి భేటీ: ఏపీ జౌళి రంగానికి ఊతం
అమరావతిలో ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ’ (నిఫ్ట్), కుప్పంలో ‘పీఎం మిత్రా పార్క్’ ఏర్పాటు చేయాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌ను సీఎం చంద్రబాబు కోరారు. సచివాలయంలో జరిగిన భేటీలో, రాష్ట్రంలో అరటి, కొబ్బరి, వెదురు పీచు (ఫైబర్) ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై చర్చించారు.
వ్యవసాయ వ్యర్థాల నుండి ఫైబర్ తయారు చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని సీఎం వివరించారు. మంగళగిరిలో చేనేత పార్క్, అమరావతిలో హస్తకళల మ్యూజియం ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి, ఏపీకి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.










