టీడీపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘మహానాడు 2026’ విజయవంతంగా ముగిసింది. తాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జరిగిన తొలి మహానాడు ఇదని నారా లోకేశ్ పేర్కొన్నారు.
ఈ విజయాన్ని పార్టీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా అభిమానులు, ఐటీడీపీ, ఎన్ఆర్ఐలు మరియు మిత్రపక్షాలతో పాటు సహకరించిన అందరికీ అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రధాని మోదీ పిలుపుతో నెల్లూరు మహానాడును హైబ్రిడ్ విధానంలోకి మార్చి, చంద్రబాబు నాయుడి స్ఫూర్తితో విజయవంతం చేశామని చెప్పారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేయడం ఈ మహానాడు సాధించిన మరో ఘన విజయమని లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.










