చిత్తూరు జిల్లాలో ఆపరేషన్స్ నాన్ కేడర్ ఎస్పీగా శ్రీ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అడిషనల్ ఎస్పీలకు నాన్ కేడర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పదోన్నతిలో భాగంగా, రాజశేఖర్ రాజు జిల్లా పోలీసు కార్యాలయంలో ఆపరేషన్స్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం, ఆయన జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి IPSని మర్యాదపూర్వకంగా కలిశారు# కొత్తూరు మురళి.










